నెల జీతానికి సినిమాలు తీస్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లేనా… అప్డేట్ అవ్వండి రా అయ్యా…!!

సినీ ఇండస్ట్రీలో సరైన ప్లానింగ్ తో పోతే కెరీర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతుంది. కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కొనసాగితే మాత్రం అంతే.. కొంతమంది హీరోలు ప్రారంభంలో తారాజువ్వలాగా నింగికి ఎగురుతారు. ఆ తరువాత వరుస ఫ్లాప్స్ కారణంగా ఎంత వేగంగా ఎదిగారు అంతే వేగంగా కిందకి పడిపోతారు. అలో కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన విజయాలను అందుకుని ఆ తరువాత దానిని కొనసాగించ లేకపోయినా కొంతమంది హీరోలు ఇప్పుడు నెల జీతంతో సినిమాలలో నటించడానికి ఒప్పుకుంటున్నారు.

అలాంటి హీరోల లిస్ట్ తీస్తే ముందుగా మనం రాజ్ తరుణ్ గురించే మాట్లాడుకోవాలి. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోగా మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ హీరోగా ఎదిగి, ఇప్పుడు నెలకు లక్ష రూపాయల జీతంతో సినిమాలు చేస్తున్నాడు. ఇక రాజ్ తరుణ్ తరువాత నెల జీతంతో పని చేస్తున్న హీరో సందీప్ కిషన్. రాజ్ తరుణ్ కి అయిన రెండు మూడు హిట్ సినిమాలు ఉన్నాయి. కానీ సందీప్ కిషన్ కి కేవలం ” వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ” సినిమా మినహా ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేదు.

కానీ పట్టు వదలడానికి ఇష్టపడక వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అసలు ఒక్క సక్సెస్ లేకపోయినా నిర్మాతలు ఈయనతో సినిమాలు చేశారు. ఇక ఈయన కూడా నెల జీతంతో సినిమాల్లో పని చేస్తున్నాడు. వీళ్ళకంటే టాలీవుడ్ లో సీనియర్ హీరోలు మరియు హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయితే రాజ్ తరుణ్ ఇప్పుడు హీరో రోల్ ని పక్కన పెట్టి నాగార్జున..” నా సామి రంగ ” సినిమాలో ఓ ముఖ్య పాత్రలో పోషించనున్నాడట. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ కి పేరు వస్తే.. ఈయన రెమ్యూనరేషన్ పెంచే అవకాశాలు ఉన్నాయి.