” ఓజి ” మూవీలో ఆ సీన్స్ ఏ హైలెట్… ఏదైనా నువ్వు కేక బాసు…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. పవన్ తాజాగా నటిస్తున్న సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో ” ఓజి ” మూవీ కూడా ఒకటి. పవన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి టాలెంటెడ్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ కి జోడీగా ప్రియాంక చోప్రా నటించనుంది.

ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ తర్వాత ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ చాలా హైలెట్గా ఉంటాయట.

సుజిత్ ఈ సినిమా కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్టుపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.