ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అప్పట్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీని పొందింది. ఇక కొంతకాలం లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా భూమిక అలరించింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వయసు 44. సహజంగానే ఈ వయసులో హీరోయిన్ గా ఆఫర్లు తగ్గుతాయి.
అక్క, వదిన తరహా పాత్రలు చేస్తూనే కొన్ని ప్రయోగిత్మక సినిమాలు కూడా చేస్తుంది. భూమిక చివరగా తెలుగులో సీతారామం, సిటిమార్ లాంటి సినిమాలలో నటించింది. ఇక ఇదిలా ఉంటే 2007లో భారత్ ఠాకుర్ అనే వ్యక్తిని భూమికా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు.
ఇక తాజాగా భూమిక సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ.. ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక అంతేకాకుండా ఆమె భర్తకు ఓ అభిమాని లవ్ లెటర్ రాసి పంపించినట్లు తెలిపింది. అలాగే మీ భార్యకు వినిపించండి అని చెప్పాడట ఆ అభిమాని. ఇక ఆ లెటర్ తనను ఆకర్షించినట్లు తెలిపింది భూమిక. ప్రస్తుతం భూమిక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
View this post on Instagram