త్వ‌ర‌లోనే ప్రారంభంకానున్న ” అఖండ 2 ” షూటింగ్‌.. తగ్గేదేలే అంటున్న బాల‌య్య ఫ్యాన్స్…!!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో.. బాలయ్య హీరోగా తెరకెక్కిన ” అఖండ ” సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే అఖండకు సీక్వెల్ గా ” అఖండ 2 ” రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సీక్వల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? లాంటి వాటిపై ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక తాజాగా బోయపాటి శ్రీను ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని.. వచ్చే ఆగస్టులో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో స్పెషల్ సినిమా రాబోతుందని సమాచారం.

అలాగే బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం ఈ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం బాలయ్య.. దర్శకుడు బోయపాటితో ” అఖండ 2″ సినిమా చెయ్యనున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.