ఫ్యాన్స్ కు బిర్యానీ వ‌డ్డిస్తున్న‌ నయన్.. కార‌ణం ఇదే (వీడియో)…!!

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా ” జవాన్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె ” అన్నపూరణి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతుంది.

అయితే ఈ మూవీ టీం ఇందుకోసం వెరైటీ ప్రమోషన్స్ ప్లాన్ చేయగా.. నయన్ కూడా ఆ ప్రమోషన్స్ లో అటెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయినా నయన్.. వారికి బిర్యానీని కూడా వడ్డించింది. హగ్స్, షేక్ హ్యాండ్స్ ఇస్తూ సందడి చేసింది. ఇక ఈ సినిమాలో హీరో జై కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొని.. ఆమెతోపాటు అన్నం వడ్డించాడు.

ఇక లేడీ ఫ్యాన్స్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని హింట్ ఇస్తూ.. హ్యాపీగా గడిపారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈమె ప్రవర్తన పై… ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక నీలేశ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జి స్టూడియోస్ సంస్థ నిర్మాణం వహిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది.