ప్ర‌భాస్‌కు స‌వాల్ విసిరిన షారుక్‌… డుంకీ ట్రైల‌ర్‌తో ఏం చేశాడో చూడండి ( వీడియో)

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ డుంకి. సలార్‌కు పోటీగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హీరోని దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో వికీ కౌశల్ కీలకపాత్రలో నటించడం విశేషం. డిసెంబర్ 21న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. ఇటీవల షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన జపాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. అలాగే ఎన్నో ఫ‌న్‌ ఎంటర్టైనర్ మూవీలను తెరకెక్కించిన రాజ్‌కుమార్ హిరాని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెల్కొన్నాయి.

క్రిస్మస్ కానుకగా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఫన్, ఎమోషన్ కలగలిపి ఎంతో ఆసక్తి రేపేలా ఉంది. ఇక ఈ ట్రైలర్ ఎస్‌ఆర్‌కే వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ఇందులో స్నేహం, కామెడీ, విషాదం అనే అంశాలు హైలెట్ గా కనిపించాయి. ఈ సినిమాల్లో ఇంగ్లీష్ నేర్చుకునే యూకే వెళ్లి సెటిల్ అవ్వాలనుకునే ఓ గ్రామీణ యువకుడి పాత్రలో షారుక్ ఖాన్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఎంత ప్రయత్నించినా కూడా ఇంగ్లీష్ రాకపోవడంతో దొంగ దారిలో చూకేలోకి చొరపడాలని షారుక్‌ ప్రయత్నించడం.. వారికి దొరికిపోవడం లాంటి అంశాలు అన్నీ ఈ కథలో కీలకంగా మారనున్నాయి. షారుక్ ఆ జర్నీలో స్నేహితులతో కలిసి పడే ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడు అనే అంశాన్ని క్లియర్ కట్ ట్రైలర్‌లో చూపించారు. ఇక ఇటీవల షారుఖ్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో డుంకీ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ స్టోరీ నేను లల్టు నుంచి స్టార్ట్ చేశా.. నా ఫ్రెండ్స్ తో కలిసి రాజు సర్ విజన్ నుంచి మొదలైన ప్రయాణాన్ని డుంకీ ట్రైలర్‌లో చూడవచ్చు.

 

ఈ ట్రైలర్‌లో స్నేహం, కామెడీ విషాదంతో పాటు ఇల్లు కుటుంబ జ్ఞాపకాలు అన్ని తట్టి లేపే విధంగా ఉంటాయి. నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది. డ్రాప్ టైం అనే క్యాప్షన్‌తో షారుక్ ఈ ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ తో తన కామెడీతో ఆధర కొట్టిన షారుక్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. మున్నాభాయ్ ఎంబిబిఎస్, పీకే, త్రీ ఇడియ‌ట్స్ లాంటి ఎన్నో ఫన్ ఎంటర్టైనర్‌ మూవీలను తెరకెక్కించిన రాజహిరాని దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)