నటనకు గుడ్‌బయ్ చెప్పి అలాంటి పనికి సిద్ద‌మైన‌ శృతిహాసన్.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు..

కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్… తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన నటనతో, అందంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. తండ్రికి తగిన కూతురిగా పేరు కూడా పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈమె హీరోయిన్ మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

నాని నటించిన ” హాయ్ నాన్న ” సినిమాతో త్వరలోనే ప్రేక్షకులకి తన గానం వినిపించనుంది. ఇక రీసెంట్ గా విడుదలైన స్పెషల్ సాంగ్ తో ఫిదా చేసింది కూడా. అయితే ఈ సినిమాలో ఈమె పాట పాడి డ్యాన్స్ చేసినందుకు గాను దాదాపు కోటి రూపాయల వరకు తీసుకుందని సమాచారం.

ఇక దీంతో శృతి రాబోయే రోజుల్లో నటనకు గుడ్ బాయ్ చెప్పి.. సంగీతం వైపుగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.