” పుష్ప 2 ” సినిమా పై అదిరిపోయే అప్డేట్.. !!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” పుష్ప 2″ . ఇక ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ టీం సర్వేగంగా షూటింగ్ని కంప్లీట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఓ భారీ షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నెక్స్ట్ వీక్ నుంచి పుష్ప 2 లో ఓ సాంగ్ ని మేకర్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం కొంత టాకీ పార్ట్ కొనసాగుతూ ఉండగా దాని తరువాత సాంగ్ షూట్ ని స్టార్ట్ చేయనున్నట్లు బజ్ వినిపిస్తుంది.

ఇక ఈ సినిమా సుమారు 65 నుంచి 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై బన్నీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.