ఏకంగా 15 కిలోలు పెరిగిపోయిన ఆ స్టార్ బ్యూటీ.. బరువు తగ్గడానికి ఎంత కష్టపడుతుందో(వీడియో)..

ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” చంకీలా ” ప్రాజెక్ట్ గురించి..” యానిమల్ ” సినిమాను వదులుకున్న పరిణీతి చోప్రా.. ప్రస్తుతం జిమ్లో దర్శనమిచ్చింది. ఇక ప్రస్తుతం సింగర్ అమర్ జోత్ కౌర్ పాత్రలో కనిపించబోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఈమధ్య ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే ఈ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేందుకు 15 కిలోలు పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. ఏ ఆర్ రెహమాన్ స్టూడియోలో పాటలు పాడటం, ఇంటికి వెళ్లి జంక్ ఫుడ్ లాగించడంతో ఈ 6 నెలలు గడిపానని చెప్పింది. చిత్రీకరణ పూర్తికావడంతో మళ్లీ సన్నగా అయ్యేందుకు జిమ్ కు వెళ్లిన పరిణీతి .. ఇదంతా ఇంతియాజ్ కోసమే చేసినట్లు తెలిపింది.

ఇక త్వరలో నెట్ పిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుండగా.. షూటింగ్ డేట్స్ ను మిస్ అవుతున్నట్లు ఇన్స్టాలో పోస్ట్ షేర్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జిమ్ కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన ప్రేక్షకులు…” పాపం తగ్గడానికి ఎంత కష్టపడుతుందో? ఏమని ఆ దేవుడే కరుణించాలి ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.