నేనింతే.. నేను నాలానే ఉంటా.. నాది చిన్న ప్రపంచం.. నాని ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..

నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన నాని తర్వాత హీరోగా మారి.. నాచురల్ స్టార్‌గా క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఇక ఈ జనరేషన్ హీరోస్ అందరికన్నా నాని చాలా డిఫరెంట్ గా ఉండే వ్యక్తి. చివరిగా మాస్ మసాలా సినిమా అయినా దసరా తో పాన్ ఇండియాలో సందడి చేసిన నాని.. ప్రస్తుతం హాయ్ నా సినిమాతో ఆ స‌క్స‌స్‌ కంటిన్యూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. చాలామంది హీరోలతో పోలిస్తే నాని చాలా డిఫరెంట్ అనడానికి కూడా కారణం ఉంది. కొన్ని క్వాలిటీస్ అతని హీరోగా, స్టార్ హీరోగా, నేచురల్ హీరోగా మార్చాయి. మరి ఆ క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాని తన కెరీర్ లోని కొన్ని విషయాలకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాధానాలు చెప్తూ ఉంటాడు.

అందులో ముఖ్యంగా నాని ఇప్పుడు తీస్తున్న అన్ని సినిమాలు ఒరిజినల్ స్టోరీస్ కావడం విశేషం. గతంలో రెండు సినిమాలను మాత్రమే నాని రీమేక్‌గా నటించాడు. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం తన దర్శకులు చెప్పే పొంతకథలపైనే ఆధారపడుతూ కంటెంట్ ఉంటేనే ఆ కథలను ఎంచుకుంటూ సినిమాల్లో నటిస్తున్నాడు. భాషతో సంబంధం లేకుండా సినిమా స్టోరీ బాగుంటే మాత్రమే సినిమాలు తీస్తున్నాడని.. అందుకే రీమేక్ కన్నా ఒరిజినల్ క‌థ‌ల‌కే ఎక్కువగా నాని ప్రధాన్య‌తిస్తున్నాడని టాక్. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా మల్టీ స్టార‌ర్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే.

నాని మాత్రం అందుకు రెడీగా ఉండడు. తన కేవలం తన సినిమాలపై మాత్రమే ఫోకస్ చేస్తూ.. మిగతా హీరోలకు తన సినిమాల్లో తీసుకొని నటించే ఉద్దేశం లేదని చెప్తుంటాడు. ఇక అదే విధంగా వేరే హీరోల సినిమాల్లో కూడా తనుకనిపించాలని ఆశ ఏమీ లేదని వివరించాడు. ఇక ప్రయోగాత్మకమైన సినిమాలను చేయడంలో మీ ఒపీనియన్ ఏంటి అని అడగగా నేను ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలకే ప్రాధాన్యత ఇస్తాను. అంతేకాదు తన ముందు తనకు ఎంతో నచ్చిన దర్శకుడు ఉన్న కూడా ఎప్పుడూ నాతో సినిమా తీయమని త‌ను అడగట‌. నేను ఇలాగే నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నా. ఇకపై కూడా ఇలాగే ఉండబోతున్న.. నేను నాలాగే ఉంటా.. అంటూ క్లియర్ గా వివరించాడు.