చివరివారం నామినేషన్స్ లో అతను తప్ప అందరూ.. టైటిల్ విన్నర్ పై బిగ్ బాస్ సూపర్ ట్విస్ట్..

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్త‌రంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో ఈ సీజన్ ముగియ‌నుంది. ఈ నేపథ్యంలో టైటిల్ పోరు కోసం కంటిస్టెంట్‌లు హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అర్జున్ అంబటి తప్ప మిగతా ఆరుగురు నామినేట్ అయ్యారు. అర్జున్ అంబటి పవర్ అస్త్రాను గెలుచుకోవడంతో అతని నామినేట్ చేయడం కుదరదు అంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. కాగా ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్న ఆ ఆరుగురికి బిగ్ బాస్ మరొక ఆసక్తికర విషయాన్ని వివరించాడు.

టైటిల్ విన్నర్ ఎవరు అనేది తెలిసేందుకు ఈ వారం నుంచే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వబోతున్నాయని.. అనౌన్స్మెంట్ చేశాడు. దీనిబట్టి ఈవారం ఎలిమినేషన్స్ కాదు డైరెక్ట్ గా ఓటింగ్ పోల్స్ తో టైటిల్ విన్నర్ కోసం ఓటింగ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాలు ఈ వోటింగ్ జరుగుతుంది. అందులో అతి తక్కువ ఓట్స్ ఉన్నవారికి 14వ వారం ఎలిమినేషన్, తర్వాత మిడ్ వీక్ లో మరొకరు ఎలిమినేట్ కాబోతున్నారు. దీంతో 16వ వారానికి టాప్ 5 లో ఉండే ఐదుగురు కంటెస్టెంట్‌లే మిగులుతారు.

ఈ రెండు వారాల్లో హయెస్ట్ ఓటింగ్ సాధించుకున్న కంటెస్టెంట్ బిగ్ బాస్ టైటిల్ విన్నార్‌గా నిలవబోతున్నాడు. అయితే పిఆర్ ద్వారా కన్సిస్టెన్సీ ఎక్కువ. ఓట్స్ తెచ్చుకునే అవకాశం ఉండడంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఈవారం నుంచి ఉల్టా పల్టా కాన్సెప్ట్ మొదలుపెట్టారు. విన్నర్ ఓటింగ్ పోల్ స్టార్ట్ చేసి పిఆర్ టీం లకు సూపర్ ట్బిస్ట్ ఇచ్చారు. ఈ విన్నర్ ఓటింగ్ పోల్‌లో అర్జున్ అంబటి పేరు కూడా ఉంది. 14వ వారం మాత్రం అతనికి తక్కువ ఓట్స్ వచ్చిన ఎలిమినేట్ కాడు. కానీ ఆ తర్వాతి వారం మాత్రం ఎలిమినేట్‌ అయ్యే ఛాన్స్ ఉంది.