అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. ఇండియా వదిలి వెళ్లిపోబోతున్న స్టార్ తెలుగు హీరో..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఎన్టీఆర్ ఇండియా వదిలి వెళ్ళిపోతున్నాడా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అయితే ఇది లైఫ్ టైం గుడ్ బై కాదు .. కొన్నాళ్ల వరకే గుడ్ బై అంటూ తెలుస్తుంది. ఎన్టీఆర్ తన సినిమా షూటింగుల కోసం ఫారిన్ కంట్రీస్ లో ఏకంగా నాలుగు నెలల పాటు ఉండబోతున్నాడట . ప్రజెంట్ దేవర సినిమా షూట్ లో బిజీ బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.

అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కొన్ని షాట్స్ చిత్రీకరించారు. మరికొన్ని షాట్స్ అమెరికాలో చిత్రీకరించబోతున్నారట . అంతేకాదు పార్ట్ 2 కి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా అమెరికాలోని చిత్రీకరించబోతున్నారట . ఇదే క్రమంలో ఎన్టీఆర్ ఒక నాలుగు నెలల పాటు అమెరికాలోనే ఉండబోతున్నాడు అంటూ తెలుస్తుంది .

అంతేకాదు ఇన్నాళ్లు ఎప్పుడు ఇన్ని నెలలు ఇంటికి దూరంగా తారక్ ఉండలేదు. ఫస్ట్ టైం తారక్ ఇన్ని నెలలు ఫారిన్ కంట్రీస్ లో ఉండబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .అంతేకాదు ఈ సినిమాలో తారక్ ని మనం ఇదివరకు ఎప్పుడు చూడని స్పెషల్ లుక్ లో చూడబోతున్నామట .ఆర్ఆర్ఆర్ కి మించిన హిట్ ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!