“ఏంట్రా..చెప్పు వదిలేసినా పాటను హిట్ చేస్తారా..?”..పుష్ప సినిమా పై అమితాబ్ షాకింగ్ కామెంట్స్ వైరల్..!!

పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . అస్సలు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజై సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాకుండా బాక్స్ ఆఫీస్ చరిత్రను తిరగరాసింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ..టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించి తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును ఎలా కొల్లగొట్టిందో మనకు తెలిసిందే. ముఖ్యంగా సినిమాలో ఇది నెగటివ్ పాయింట్ అని వేలు పెట్టడానికి ఆస్కారం లేకుండా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించాడు .

రీసెంట్ గానే ఈ సినిమాకు గాను ఏకంగా ఉత్తమ జాతీయ నటుడి అవార్డు అందుకున్నాడు బన్నీ . అప్పటినుంచి పుష్ప2 కి సంబంధించిన విషయాలు మరింత ట్రెండ్ అవుతున్నాయి . కాగా తాజాగా బాలీవుడ్ లెజెండ్ హీరో అమితాబ్ హోస్ట్ గా ” కౌన్ బనేగా కరోడ్ పతి”రియాల్టీ షో జరుగుతున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ షో సీజన్ 15 జరుగుతుంది . రీసెంట్ గా జరిగిన ఒక ఎపిసోడ్లో పుష్పకి సంబంధించిన ఒక ప్రశ్న ఎదురయింది .

2023 లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న నటుడు ఎవరు అని ప్రశ్నిస్తాడు. ఆమె అల్లు అర్జున్ అంటూ బ్దులిస్తుంది . అనంతరం అమితాబ్ మాట్లాడుతూ..” పుష్ప సినిమా చూశారా..? చాలా చాలా బాగుంటుంది..? మూవీలో సాంగ్స్ నాకు చాలా ఇష్టం . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక పాటలో చెప్పు వదిలేసి స్టెప్ వేస్తాడు. అది నాకు బాగా నచ్చింది. ఆ పాట కూడా బాగా వైరల్ అయింది ..చెప్పు వదిలేసినా కూడా వైరల్ అవుతుందా ..? అని నాకు అప్పుడే అర్థమైంది .. అలా ఆ స్టార్ హీరో చేయడం ఇదే మొదటిసారి” అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి కొంతమంది ఇదే పాజిటివ్ కామెంట్స్ ని నెగటివ్ గా ట్రోల్ చేస్తూ ..ఇప్పుడు పుష్ప సినిమాని అమితాబ్ పొగిడినట్టా..? తిట్టినట్టా..? అంటూ వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు. అయితే అమితాబ్ మాత్రం పుష్ప సినిమాని పాజిటివ్ వేగానే ప్రశంసించారు..!!