మరొకసారి తెరపైకి అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకుల గోలా..!!

బాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్.. ప్రపంచ సుందరిగా టైటిల్ ని గెలుచుకున్న ఐశ్వర్యారాయ్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇటీవలే తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ని చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 2న ఆమె 50వ పుట్టినరోజున జరుపుకోవడం జరిగింది. ఇందులో ఆమెతోపాటు ఆమె కూతురు ఆరాధ్య ఆమె తల్లి బృందారావు మాత్రమే పాల్గొన్నారు.


ఇక తన భార్య పుట్టినరోజు వేడుకలలో తన భర్త అభిషేక్ బచ్చన్ మాత్రం కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా అభిషేక్ బచ్చన్ పైన పలువురు నేటిజెన్సీ సైతం ఫైర్ అవుతున్నారు. తన భార్య పుట్టినరోజు విషెస్ చెప్పడానికి కూడా తీరిక లేదా అంటూ ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. ఐశ్వర్యరాయ్ 50వ పుట్టినరోజును అత్యంత ఘనంగా జరుపుకుంటారని అభిమానులు అనుకోగా వారికి నిరాశే ఎదురయింది. మనీష్ మల్హోత్ర నిర్వహించిన దీపావళి పార్టీలో కూడా ఐశ్వర్యారాయ్ సింగిల్ గా కనిపించింది.

దీంతో మరొకసారి ఐశ్వర్యరాయ్ -అభిషేక్ బచ్చన్ జంట పైన విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తన భార్య పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండడంతోపాటు ఎప్పుడో అర్ధరాత్రి విష్ చేయడంతో ఈ వార్తలు మరింత వైరల్ గా మారుతున్నాయి. దీంతో మరొకసారి తెరమీదకి డైవర్స్ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ విషయం పైన ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి. ఇటీవలే ఐశ్వర్యరాయ్ కూడా పలు సినిమాలలో నటించేందుకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.