కమెడియన్ సత్యం రాజేష్ పొలిమేర సినిమాతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటి లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. చేతబడుల నేపథ్యంలో సస్పెన్స్ అండ్ హర్రర్ త్రిల్లర్ చిత్రంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వ్యూస్ ని రాబట్టుకుంది. దీంతో సీక్వెల్న సైతం థియేటర్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం మా ఊరి పొలిమేర-2 సినిమాతో నవంబర్ 3న విడుదల చేయగా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది. ఊహించని ట్విస్టులతో అందరి చేత ప్రశంసలు అందుకున్నది.
మా ఊరి పొలిమేర-2 కి ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా క్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది. ఇందులో డాక్టర్ కామాక్షి భాస్కర్ల ,బాలాదిత్య, రవి వర్మ ,గెటప్ శ్రీను, సాహితీ దాసరి తదితరులు సైతం నటించడం జరిగింది. మా ఊరి పొలిమేర-2 సినిమాకి సంబంధించి ఓటిటి రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారుతోంది .ఈనెల చివరి వారంలో ఈ సినిమా డిజిటల్ స్ట్రిమ్మింగ్ కు రాబోతోందని టాక్ వినిపిస్తోంది. లేకపోతే ఈనెల చివరి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మా ఊరి పొలిమేర చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమ్మింగ్ అయ్యింది. రెండో పార్ట్ కూడా ఇదే ఓటీటి లోనే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం .అయితే దీనిపైన ఇంకా అధికారికంగా ప్రకటన వెలుపడాల్సి ఉన్నది. మా ఊరి పొలిమేర సినిమా సీక్వెల్ కు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఓటిటి కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.