బాలీవుడ్ మొదటి హీరో ఎవరో తెలుసా… ప్రస్తుతం ఆయన ఫ్యామిలీ ఏం చేస్తున్నారంటే.‌.!!

బాలీవుడ్ లో మొదటి హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు.. కళ్యాణం వెంకటసుబ్బయ్య. ఈయనని ఈలపాట రాఘరామయ్య అని కూడా పిలుస్తారు. ఈ పేరుతోనే ఈయన బాగా పాపులర్ అయ్యారు. తెలుగు రంగస్థలం సిని నటుడు గానే కాకుండా గాయకుడుగా కూడా ఈయన మంచి పేరు పొందారు. గుంటూరు జిల్లా లో కళ్యాణం నరసింహారావు, కళ్యాణం వెంకటసుబ్రయ్య దంపతులకు ఈయన జన్మించారు.

చిన్నప్పటి నుంచి ఈయనకు సంగీత నాటకాలలో ఆసక్తి ఉండేది. చిన్నతనం నుండే మ్యూజిక్ నాటకాలలో రాణించేవారు. ఈయన తన సంగీతంతో పశువులని కూడా మైమరిపించేలా చేసేవాడు. ఈలలు వేస్తూ, అందరిని బాగా ఆకట్టుకునేవారు. ఒక నాటక బృందంలో చేరి రాఘరాముని క్యారెక్టర్ లో నటించి పేరు ప్రఖ్యాతలు పొందారు. కృష్ణుడి పాత్రలో సైతం ఎంతో అద్భుతంగా చేశారు.

ఈయన ప్రముఖ గొప్ప గొప్ప వాళ్ల నుంచి ప్రశంసలు సైతం అందుకున్నారు. అంటే ఈయన ఎంత గొప్పవాడు మనందరం అర్థం చేసుకోవాలి. 20వేల నాటకాలు 100 సినిమాలలో నటించారు. 1938లో రంగస్థలం నటి ఆదోని లక్ష్మీని పెళ్లి చేసుకున్నారు. ఇక 75 సంవత్సరాల వయసులో ఈయన గుండుపోటుతో చనిపోయారు. ఈయన వారసత్వాన్ని పురస్కరించుకుని ఇటీవల ఆయన జన్మస్థలమైన శుద్ధ పల్లిలో ఈయన విగ్రహం ఏర్పాటు చేశారు.