“ఎవ్వడు ఏం పీకలేరు”..ఒక్క పోస్ట్ తో వెధవ ల నోర్లు మూయించిన నాగబాబు..మెగా బ్లడ్ రా అది..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా ఫ్యామిలీ అని కనిపిస్తే చాలు జనాలు డిజ్ లైక్ కొట్టడం బూతు పదాలను వాడడం ట్రోల్ చేయడం అలవాటుగా మార్చేసుకున్నారు . ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే రెండు చేతులు ఎత్తి నమస్కరించేవారు . అంతటి గౌరవం ఉండేది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. సడన్గా మెగా ఫ్యామిలీపై హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ జరుగుతుంది. అంతేకాదు అది ఆడవాళ్లు కాదు మగవాళ్ళు కాదు ఆ ఫ్యామిలీ నుంచి ఏ పోస్ట్ పెట్టిన ఏ న్యూస్ వచ్చినా తెగ ట్రోల్ చేస్తున్నారు జనాలు .

రీజన్ వాళ్లకే తెలియాలి. అయితే రీసెంట్ గా నాగబాబు తన కొడుకు పెళ్లిలో తన బ్రదర్స్ తో కలిసి ఫోటోలు దిగారు. ఆ ఫొటోస్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు . అంతే కాదు సుదీర్ఘంగా ఓ నోట్ కూడా రాసుకోచ్చాడు . “మా మధ్య ఎన్ని విభేదాలు వాదనలు రెగ్యులర్గా వచ్చిన.. మా బంధం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. మేము చేసిన పనులు మా జ్ఞాపకాలు మాత్రమే కాదు .. మా మధ్య ఏర్పడే విభేదాల కంటే మా అనుబంధం ఎంతో ఎంతో ముఖ్యమైనది .. మా రిలేషన్షిప్ ఎన్నో మంచి క్షణాలపై ఆధారపడి ఉంది.. మా మధ్య రిలేషన్షిప్ నిజంగా చాలా బలమైనది విడదీయలేనిది” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు .

దీనిపై కొందరు కావాలని ఓవర్గా స్పందిస్తున్నారు. కొందరు నార్మల్ గా గుడ్ సార్.. మీ బంధం ఎప్పటికీ ఇలానే ఉండాలి అంటుంటే .. మరికొందరు మాత్రం మీ ముగ్గురు కలిసి ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వడు ఏం పీకలేడు అన్న అంటూ చాలా బోల్డ్ గా ఆన్సర్ ఇస్తున్నారు.