తాళి కట్టే వేళలో వరుణ్ చిలిపి పని..సిగ్గు పడిపోయిన లావణ్య..మెగా హీరో మంచి రొమాంటిక్ ఫెలోనే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ రీసెంట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేసిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట కుటుంబ సభ్యులను ఒప్పించి ఇటలీలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మూడు రోజులపాటు వీళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫంక్షన్ చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది .

రీసెంట్గా వీళ్ళ పెళ్లికి సంబంధించిన కొన్ని ఎక్స్క్లూజివ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ లో వరుణ్ లావణ్య మెడలో చాలా ప్రేమగా తాళి కడుతున్న పిక్ కూడా వైరల్ అవుతుంది. అంతేకాదు లావణ్య త్రిపాఠి చేతుల్లో కొబ్బరికాయ పట్టుకొని చాలా సిగ్గుపడుతూ ట్రెడిషనల్ గా నడిచి వస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది . అయితే లావణ్య కు మెడలో తాళి కట్టేటప్పుడు వరుణ్ చిలిపిగా ఐ లవ్ యు చెప్పించుకొని తాళికట్టాడు .

అప్పుడు లావణ్య సిగ్గు పడిపోయింది . దానికి సంబంధించిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు సాంప్రదాయ బద్దంగా లావణ్య వరుణ్ కాళ్లకు నమస్కరిస్తూ ఉంది . దీంతో ఈ జంట ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ జంట చూడ చక్కగా ఉంది అని ..ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.