రజనీకాంత్ ని ఢీకొట్టే పాత్రలో టాలెంటెడ్ స్టార్ హీరో..!!

జైలర్ సినిమాతో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే జైలర్ సినిమా తర్వాత వరస సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న రజనీకాంత్ ఇప్పుడు తాజాగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తన 170 సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా తర్వాత 171వ సినిమా షూటింగ్లో కూడా బిజీ కాబోతున్నారు. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరో రాఘవ లారెన్స్ విలన్ గా నటించబోతున్నారని సమాచారం.


అసలు వివరాల్లోకి వెళ్తే రజనీకాంత్ 171 వ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎల్సీయూలో భాగంగానే తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో విలన్ గా రాఘవ లారెన్స్ నటిస్తున్నట్లు తమిళ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ వీర అభిమానిగా లారెన్స్ ఉన్నారని చెప్పవచ్చు. రజనీకాంత్ నటించిన చిత్రంలో ఒక నెగటివ్ రోల్ లో రాఘవ లారెన్స్ కు ఆఫర్ వచ్చిందని లారెన్స్ కి కూడా కథ చెప్పడంతో ఓకే అన్నట్లుగా సమాచారం

అయితే ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.. లోకేష్ కనకరాజు సినిమాలో హీరోలుగా విలన్ గా నటించడం ఎప్పుడూ కామన్ పాయింటే పైగా వాళ్లకి కూడా హీరోతో సమానంగా క్రేజీ లభిస్తూ ఉంటుంది. మరి రాఘవ లారెన్స్ రజనీకాంత్ సినిమాలో విలన్ గా నటిస్తే ఏ రేంజ్ లో చూపిస్తారు అంటూ అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల రాఘవ లారెన్స్ నటించిన చంద్రముఖి-2 సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.త్వరలోనే ఈయన నటించిన జిగర్తాండ సినిమాతో ప్రేక్షకులనందుకు రాబోతున్నారు.