“నా సూపర్ హీరో అతనే”.. మరోసారి అక్కినేని అభిమానులకు మండించే మాటలు మాట్లాడిన సమంత..!

సమంత.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది . క్రేజ్ డబుల్ స్థాయిలో పెంచేసుకుంది . ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకులు తీసేసుకుంది . అప్పటినుంచి తన లైఫ్ తనది అంటూ బ్రతికేస్తున్న సమంత రీసెంట్గా హాలీవుడ్ మూవీ ప్రమోషన్స్ కి హాజరైంది .

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి “ది మార్వెల్” అనే చిత్రం త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వర్షన్ ని సమంత ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో పాల్గొన్న సమంత రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానం చెప్పింది . ఇదే మూమెంట్లో ఓ రిపోర్టర్ ..”తెలుగులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగ ఒక సూపర్ హీరో సిరీస్ ను తీస్తే మీరు సూపర్ హీరోలుగా ఎవరిని ఎంచుకుంటారు..?” అని అడిగాడు .

దానికి సమాధానం ఇస్తూ సమంత..” ప్రస్తుతానికి నా దృష్టిలో అల్లు అర్జున్ నెంబర్ వన్ . అల్లు అర్జున్ అంటే పిచ్చి ..అతనే నా సూపర్ హీరో.. ఆయనతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా” అంటూ సమాధానం ఇచ్చింది . అసలే నాగచైతన్య తో విడిపోయిన తర్వాత విజయ్ దేవరకొండ తో సమంత చనువుగా ఉంటుంది అని.. ఖుషి సినిమాలో హద్దులు మీరిపోయిందని అభిమానులు ఫైర్ అయిపోతుంటే .. ఇప్పుడు అతడే నా సూపర్ హీరో అంటూ అక్కినేని అభిమానులకు మండించే విధంగా ఆమె మాట్లాడడం మరోసారి వైరల్ గా మారింది..!!