బిగ్ బాస్ 7 లో టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే… టైటిల్ మాత్రం అందుకోబోయేది ఇతనే…!!

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగుతుంది. ఇక గత సీజన్ల కంటే.. ఈ సీజన్ రసవక్తంగా సాగుతుంది. ఈ సీజన్ లో మొదట 14 మంది అడుగుపెట్టగా.. ప్రస్తుతం ఏడుగు రు కంటెస్టెంట్లు ఉన్నారు. విళల్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు.. ఏంటి అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ నిర్వహకుల సమాచారం ప్రకారం.. పోలింగ్ వివరాల ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయింది. మరి టాప్ ఫైవ్ లో ఉండేది ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. ప్రిన్స్ యావర్:


ప్రిన్స్ యావర్ టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తున్నాడు. ఈయనకి బయట కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో టాప్ 5 లో ఒకడవనున్నాడట.

2. అమర్:


అమర్ దీప్ కి సైతం బయట ఫాలోయింగ్ గట్టిగా ఉంది. ఈయన ఫాలోయింగ్ చూస్తే అంతా ఇంతా కాదు. అందువల్లనే ఈయన టాప్ 5లో ఉంటాడని సమాచారం.

3. పల్లవి ప్రశాంత్:


పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి. గేమ్స్ లో తనదైన కృషి చూపిస్తూ కొనసాగుతున్నాడు. పల్లవి ప్రశాంత్ కు సైతం ఓటింగ్ పోల్ ఎక్కువగా ఉంది. అందువల్లనే పల్లవి ప్రశాంత్ టాప్ 5 లో ఉండనున్నాడట.

4. శివాజీ:


శివాజీ సినిమాలలోనే కాకుండా బిగ్ బాస్ హౌస్ లోను సైతం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని.. ఓటింగ్ పోల్స్ లో దూసుకుపోతున్నాడు. ఈయన కూడా టాప్ 5 లో ఉండనున్నాడు.

5. అర్జున్:


అర్జున్ గేమ్స్ లో బానే ఆడుతున్నప్పటికీ.. ఓటింగ్ పోల్ తక్కువగా ఉంది. ఈయన టాప్ 5 కి వెళ్తాడో.. లేదో కన్ఫామ్ గా చెప్పలేం.

ఇలా ఓటింగ్ పోల్ ప్రకారం వీరు టాప్ 5 కంటెస్టెంట్లుగా ఉండనున్నారట. కప్పు కొట్టేది మాత్రం శివాజీ, ప్రశాంత్, అమర్ మధ్యలోనే ఉందని సమాచారం. పోల్ పరంగా శివాజీ కే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. కానీ మన బిగ్ బాస్ ఒక్కొక్కసారి పోలింగ్ పట్టించుకోడు.. అందువలన కప్ కొట్టేది ఎవరో కరెక్ట్ గా చెప్పలేము.