అనుష్క-విజయ్ దేవరకొండ కాంబోలో మిస్ అయిన సినిమా ఇదే..జస్ట్ మిస్.. లేకపోతే రచ్చ రంబోలానే..!!

అనుష్క శెట్టి .. ఈ పేరుకి కొత్త పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . ఎంతలా అంటే చిట్టి పొట్టి బట్టలు వేస్తూ క్రేజ్ పాపులారిటీ దక్కించుకున్న  హీరోయిన్స్ ను అనుష్కను పక్కన పెడితే 99 మంది శాతం అనుష్కకే ఓటు వేస్తారు . అలాంటి ఓ నటనను కనుబరిచి ఆమె హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

కాగా అనుష్క తో  సినిమా చేయాలని చాలామంది హీరోల ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.  రామ్ చరణ్ కూడా ఎంతమందితో నటించిన అనుష్కతో నటించలేకపోయాను అంటూ బాధపడ్డాడు . అయితే అలాంటి హీరోయిన్ తో నటించే  అవకాశం వస్తే విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడు . ఆ సినిమానే  “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.  ఎస్ ఈ సినిమాల్లో నవీన్ పోలిశెట్టి పాత్ర కోసం ముందుగా డైరెక్టర్ విజయ్ దేవరకొండను అప్రోచ్ అయ్యారట .

అయితే కథపరంగా అనుష్క హైలైట్ అవ్వడం నవీన్ పోలిశెట్టి పాత్ర కొంచెం తక్కువగా ఉండడంతో విజయ్ దేవరకొండ తాను ఈ పాత్రలో నటిస్తే క్రేజ్ తగ్గిపోతుంది ఏమో అని రిజెక్ట్ చేశారట . ఫైనల్లీ ఆ పాత్రను  నవీన్ పోలిశెట్టి యాక్సెప్ట్ చేసి ఓకే చేశాడు . అలా వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది..!!