అనుకున్న సమయానికంటే ఓటిటి లోకి ముందుగానే వచ్చేస్తున్న టైగర్ నాగేశ్వరరావు..!!

తెలుగు ఇండస్ట్రీకి ఇడియట్ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు రవితేజ ఆ తర్వాత తన కెరీర్లో నిన్న సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రవితేజ రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావు సినిమాతో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారని చెప్పవచ్చు.అయితే ఈ సినిమాని1980లో తెలుగు రాష్ట్రాల్లో గజదొంగగా చెలామణి అయిన స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కూడ ఒక పాత్రలో నటించారు.


ఇదిలా ఇంటే.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.ఈసినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ దాదాపు రూ. 15 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన రాలేదు. పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన ఈ సినిమా తెలుగులోనే కాస్త ప్రభావం చూపించింది కానీ ఇతర భాషలలో అంతటి ప్రభావం చూపించలేకపోయింది.

అయితే ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ ఈగల్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడన్న సంగతి మనకు తెలిసిందే.. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ సినిమాలో రవితేజ కొత్త గెటప్ లో కనిపింనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ నవదీప్ అవసరాల శ్రీనివాస్ మధుబాల ఇలా కొంతమంది కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఈసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.