ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అయింది . ఆయన ఓ యంగ్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడు అని అందుకే ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య సంగీతకు డివర్స్ ఇవ్వబోతున్నాడు అంటూ కోలీవుడ్ – టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి . అయితే దీనిపై ఇప్పటివరకు విజయ్ గాని ఆమె ఆయన భార్య సంగీత గాని స్పందించలేదు.
కానీ రీసెంట్ గా విజయ్ నటించిన లియో సినిమాలో పాపులారిటీ దక్కించుకున్న జనని మాత్రం స్పందించింది . రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..”విజయ్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే చాలు అనుకున్నానని.. ఆయనతో కూర్చొని టైం స్పెండ్ చేశానని.. ఆయన నాతో చాలా చక్కగా మాట్లాడారని .. ఆ విషయంలో నేను చాలా చాలా అదృష్టవంతురాలని అని చెప్పకు వచ్చింది. అంతేకాదు నేను శ్రీలంకన్ తమిళ్ మాట్లాడుతుంటే ఆయన తన భార్య సంగీతాయే గుర్తొచ్చింది “అంటూ చెప్పుకొచ్చారట .
“ఆమె కూడా శ్రీలంకలోని జఫ్నాలోనే పుట్టి పెరిగిందట . ఈ విషయాన్ని స్వయాన విజయ్ నే ఆమెకు చెప్పాడట . అంతేకాదు ఆయన ఆమెను చెల్లెలుగా ట్రీట్ చేశాడని.. చాలా చాలా బాగా మాట్లాడారని వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారు అని వస్తున్న వార్తలు అస్సలు వాస్తవం కాదు “అంటూ తేల్చేసింది జనని. దీంతో విజయ్ కు సంగీత మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేయడమే కాకుండా ఇలా విడాకుల వార్తలకు చెక్ పెట్టేసింది జనని..!!