సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొన్ని క్రేజీ కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయ్యాయి అంటే మళ్ళీ సెట్ అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత టైం తీసుకున్నాక ఆ కాంబో సెట్ అవుతుందా..? అంటే నో అని ఆన్సర్ దక్కుతుంది . అలా మిస్ అయిన కాంబోలు ఎన్నో ఉన్నాయి. ఆ లిస్టులోకే వస్తుంది అనుష్క శెట్టి – ఎన్టీఆర్ ల కాంబో . వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా వస్తే చూడాలి అని కొన్ని సంవత్సరాలుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు .
కానీ ఆ సాహసం ఏ డైరెక్టర్ చేయలేకపోతున్నారు . అయితే కొన్నాళ్ళు ముందు ఈ సినిమాలో ఒక కాంబో రావాల్సింది . అయితే ఎన్టీఆర్ నే ఆ పాత్ర రిజెక్ట్ చేశాడు. ఆ సినిమా మరేదో కాదు. వేదం ..వేదం సినిమాలో అనుష్క పాత్ర ఎంత బాగా పాపులారిటీ దక్కించుకుందో మనం చూసాం .. అప్పటివరకు అందరూ హీరోయిన్స్ గ్లామరస్ రోల్స్ చేస్తుంటే ఫస్ట్ టైం డేరింగ్ స్టెప్ వేసి ఒక వ్యభిచారి పాత్రలో కనిపించింది అనుష్క .
ఈ సినిమాలో మనోజ్ – అల్లు అర్జున్ కీలక పాత్రలో కనిపించారు . అయితే అల్లు అర్జున్ కన్నా ముందే ఆ పాత్ర కోసం ఎన్టీఆర్ ని చూస్ చేసుకున్నారట డైరెక్టర్ క్రిష్. కానీ ఎన్టీఆర్ అలాంటి పాత్ర చేయడానికి ఇష్టపడలేదట . ఆ కారణంగానే ఆ సినిమా మిస్ చేసుకున్నాడట. అలా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయిపోయింది . ఒకవేళ నిజంగానే ఈ సినిమా చేసుంటే ఆ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ చాలా టఫ్ సిచువేషన్ ఫేస్ చేసేదని.. బన్నీ ఈ సినిమా తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడని ..జస్ట్ మిస్ అయిపోయాడు తారక్ అని..సినిమా రిజెక్ట్ చేసి ఎన్టీఆర్ మంచి పనే చేశాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!