పడిలేచిన కెరటం హీరోయిన్ త్రిష… ఆ ఘటన ఆమె ఆత్మస్థైర్యాన్ని చంపలేకపోయింది!

హీరోయిన్ త్రిష గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. 40 ఏళ్ల వయస్సులో కూడా ఆమె నేటికీ పాతికేళ్ళ హీరోయిన్ లాగా కనబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి జెనరేషన్ అమ్మాయిలకు ఆమె టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కడ అందంలోనే కాదు, నటనలో కూడా ఆమెది అందేవేసిన చేయి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన త్రిష అగ్ర కథానాయకిగా రాణిస్తుందని బహుశా ఆమె కలలో కూడా ఊహించి వుండదు.

ఒకప్పుడు తెలుగులో రాణించిన ఆమె ఇపుడు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా రానిస్తోంది. అక్కడ ఆమెకి సామి, గిల్లి వంటి చిత్రాలు స్టార్‌ హీరోయిన్‌గా నిలబెట్టాయి. అలా తమిళంతోపాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో కథానాయికగా నటించింది. మొదట్లో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి బెడిసి కొట్టిన ఘటన త్రిష కెరీర్‌ పై బలంగానే పడిందని చెప్పుకోవచ్చు. అదే ఒకెట్టయితే ఆమె పీక్ లో వున్నపుడే కొంతమంది దుర్మార్గులు ఆమె బాత్ రూము వీడియోని లీక్ చేసి శునకానందం పొందారు. కానీ ఆ ఘటన ఆమె జీవితంపైన ఎటువంటి ప్రభావం చూపలేదు. మొదట్లో ఆమె బాధపడినా తరువాత తన పని తాను చేసుకుంటూ పోయింది. కట్ చేస్తే ఆమె ఇపుడు ఓ సూపర్ స్టార్.

మొన్నటికి మొన్న పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో ఆమె యువరాణి కుందవైగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం రెండు భాగాలు హిట్‌ కావడంతో త్రిష పేరు మరోసారి మారుమోగింది. ఆ తర్వాత కూడా వరుసగా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి. ఇటీవల విజయ్‌ సరసన నటించిన లియో చిత్రం అదిరిపోయే వసూళ్లు రాబట్టిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆమె అజిత్‌కు జంటగా విడాముయర్చి, కమల్‌ హాసన్‌ సరసన మణిరత్నం దర్శకత్వంలో కూడా నటించే అవకాశం దక్కించుకుంది.