తమన్నా, విజయ వర్మల‌ లవ్ బ్రేకప్… పెళ్లి కూడా పెటాకులు అయిపోయిందా…!!

మిల్కీ బ్యూటీ తమన్న ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందం, నటనతో ఎంతో మంది అభిమానులని దక్కించుకుంది. ఈ బ్యూటీ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ భాషల్లో నటించింది. ఇక ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్. ఎవరో ఒక వ్యక్తిని ప్రేమిస్తుంది అంటూ… డేటింగ్ లో ఉందని వార్తలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తమన్నా పై కూడా ఇలాంటి వార్తే వచ్చింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందంటూ… డేటింగ్ చేస్తుందంటూ అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వార్తలపై తమన్నా ముందుగా మేము ఇద్దరం ఫ్రెండ్స్ అని.. చెప్పినప్పటికీ కొన్ని రోజులకి మళ్లీ వారి రిలేషన్ ని బయట పెట్టింది. బయటికి ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లడం, ఫంక్షన్లకి కలిసి అటెండ్ అవ్వడం వల్ల వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నారని అందరూ అనుకున్నారు. తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరొక వార్త వైరల్ అవుతుంది. బయట ఎక్కడ వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు, దీంతో వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వస్తున్నాయి.

 

తమన్నా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది. అటు విజయ్ వర్మ కూడా తన సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మను తమన్నా గురించి అడగగా.. దానికి ఏమాత్రం విజయ్ వర్మ స్పందించకపోవడంతో వీరి పెళ్లికూడా ఆగిపోయింది అంటూ.. ఈ వార్తల‌ను మరింత స్ప్రెడ్ చేశారు. ఓ ఫంక్షన్ల కు ఇద్దరూ కలిసి హాజరయ్యారు. వీరిద్దరూ ఫోటోలు సైతం దిగారు. దీంతో ఈ వార్తలకు చెక్ పడ్డాయి. మీరు పెళ్లి కూడా త్వరలోనే జరగనుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.