ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . రీసెంట్ గానే డస్కీ బ్యూటీ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది . కోలీవుడ్ డైరెక్టర్ కేఎల్ విజయ్ తో ప్రేమాయణం నడిపిన ఈమె ఆయనని పెళ్లి చేసుకొని చాలా తక్కువ టైమే కాపురం చేసి విడాకులు తీసేసుకుంది . అసలు వీళ్ళు ప్రేమించుకున్న అంత కాలం కూడా భార్య భర్తలు గా ఉండలేకపోయారు . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అయితే కొంతకాలం బ్రేక్ తీసుకున్న అమలాపాల్ సడన్గా తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టింది .
సరిగ్గా ఆమె పెళ్లి చేసుకునే వారం రోజుల ముందు తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది .ఆమె బర్త్డ డే నాడు తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయడంతో యాక్సెప్ట్ చేసి లైవ్ లోనే ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత వెంటనే పది రోజులు కూడా కాక ముందే జగత్ దేశాయ్ అమలాపాల్ ను పెళ్లి చేసుకున్నాడు . దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . అయితే అసలు ఎవరు ఈ జగత్ దేశాయ్..?
అమలాపాల్ కు ఎలా పరిచయమయ్యాడు..? అసలు వీళ్ళు మధ్య బంధం ఎలా స్ట్రాంగ్ గా ఎప్పుడు మారింది..? ఆయన ఏం చేస్తుంటాడు..? అనే విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అభిమానులు. నిజానికి జగత్ దేశాయ్ చాలా చాలా మంచి క్యారెక్టర్ గల వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఈయన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్.. దేశంలోనే టాప్ బిజినెస్ మాన్ లో ఒకరుగా ఈయన మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . ఆస్తి గురించి అయితే చెప్పనవసరం లేదు . కొన్ని వందల కోట్లకు ఒక్కడే వారసుడు. చిటికెస్తే క్షణాల్లోనే అన్ని పనులు జరిగిపోయే అంత స్టేటస్ కల వ్యక్తి.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా భారీగానే ఉంది . అందరూ వెల్ సెటిల్. మొత్తానికి మంచి సౌండ్ పార్టీని పట్టేసింది అమలాపాల్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు..!!