అదే పని జాన్వీ చేస్తే శ్రీదేవిలా రాజ్యం ఏలేసేయచ్చుగా.. ఫ్యాన్స్ ఎక్స్ట్రఆర్డనరీ సజెషన్..!!

సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరి అనగానే అందరికీ టక్కున గుర్తుచేది శ్రీదేవి . ఈ పేరు చెప్తే కుర్రాళ్ళకి అంకుల్స్ కి ఎంత హ్యాపీ ఫీలింగ్ కలుగుతుందో అమ్మాయిలకి కూడా ఆంటీలకు కూడా అంతే గౌరవం కలుగుతుంది.  తన కట్టు తన బొట్టు తన మాట తన నటనతో హ్యూజ్ ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుని నెంబర్ వన్ హీరోయిన్గా మకుటం లేని మహారాణిగా వెలిగిన శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేదు . దుబాయిలో బాత్రూంలో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది .

ఇప్పటికీ ఈ మరణం పై అభిమానులకు పలు సందేహాలు ఉన్నాయి . అయితే వాటిని తీర్చే నాధుడే లేదు.  కాగా ఈమె వారసత్వంగా జాన్వీ  కపూర్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది . బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తుంది . టాలీవుడ్ లో కూడా దేవరతో డెబ్యూ ఇవ్వబోతుంది . అయితే  ఇండస్ట్రీలో శ్రీదేవిగా జాన్వీ  కపూర్ సెటిల్ అవ్వాలి అంటే హాట్ హాట్ ఫోటోషూట్స్ చేయడం కాదు అని తన తల్లి ఎలాంటి ఇంపార్టెంట్ పాత్రలను చూస్ చేసుకుని సామాన్య జనాల చేత కూడా శభాష్ అనిపించుకున్నిందో అదే వే ఆఫ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఆమె చూస్ చేసుకోవాలని కోరుతున్నారు.

అంతేకాదు శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ ఎప్పటికీ మా హృదయాలలో ప్రత్యేక స్థానం దక్కించుకుంటుంది అని .. ఆ చిట్టి పొట్టి బట్టలు వేయకుండా పద్ధతిగా ఉంటూ పద్ధతిగా రోల్స్  చేస్తే శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఆమె ప్లేస్ ని రీప్లేస్ చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు . చూద్దాం మరి శ్రీదేవి కూతురు జాన్వి ఏం చేస్తుందో..?