ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి సెన్సేషనల్ మ్యాటర్ లీక్.. బాహుబలికి అమ్మ మొగుడి లాంటిదే ఇది..!!

వామ్మో .. ఏంటిది నిన్న మొన్నటి వరకు దేవర సినిమా లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు  అంటూ ప్రచారం జరిగింది.  ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో సరికొత్త బజ్  నడుస్తుంది. దీంతో  ఫ్యాన్స్ కి ఏమీ అర్థం కావడం లేదు . మనకు తెలిసిందే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .

రెండవ హీరోయిన్గా రష్మిక మందన్నా.. మృణాల్ ఠాకూర్  మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది . ఎవరో ఒకరు అయితే కన్ఫామ్ గా తీసుకుంటారు . అయితే రీసెంట్ గానే కొరటాల శివ దేవర సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నాం అంటూ ప్రకటించారు . ఇప్పుడు సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్ బజ్ వైరల్ అవుతుంది. దేవర పార్ట్ వన్ ఎండింగ్లో సీనియర్ దేవర మరణిస్తాడు అని ..పార్ట్ 2 లో యంగ్ దేవరకు పెళ్లి జరుగుతుంది అని..

మూడోతరం జనరేషన్ నుంచి మరో కొత్త దేవర ని ఇంట్రడ్యూస్ చేస్తారు అని అలా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు అని సరికొత్త న్యూస్ వైరల్ అవుతుంది. కథ కొంచెం కన్ఫ్యూషన్ గా ఉన్న కొరటాల మాత్రం ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా కాన్ఫిడెంట్ గా ఈ కథను తరికెక్కిస్తున్నారట . దీంతో ఈ సినిమా బాహుబలికి మించిన రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్స్తుంది అంటూ ఇప్పటినుంచి ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!