ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హోదాను సంపాదించడం సాధారణ విషయం కాదు. కొంతమంది హీరోలు అవుదామని వచ్చి దర్శకులు అవ్వచ్చు. మరి కొంతమంది దర్శకులుగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలుగా సెట్ అవ్వచ్చు. అంతే కాకుండా హీరోలు అవుదామని వచ్చిన ఎంతోమంది ముందుగా ఏదో ఒక అవకాశాన్ని చేదెక్కించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా యాక్టర్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన మన టాలీవుడ్ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.
నాని :
నాచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్గా కరీర్ స్టార్ట్ చేశాడు. అష్టా చమ్మా సినిమాతో హీరోగా అవకాశం రావడంతో తన సత్తా చాటుకుని హీరోగా మరిన్ని అవకాశాలను దక్కించుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు నాని.
రవితేజ :
మాస్ మహారాజు రవితేజ కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రవితేజ.. సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో చేరి వరుస సినిమాలను నటిస్తున్నాడు.
రాజ్ తరుణ్ :
యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా మొదటి అసిస్టెంట్ డైరెక్టర్ గానే తన సినీ కెరీర్ స్టార్ట్ చేశాడు. తర్వాత ఉయ్యాల జంపాల సినిమాలో హీరోగా అవకాశం రావడంతో అతని జాతకమే మారిపోయింది. ఈ సినిమా హిట్ కావడంతో తర్వాత వరుస అవకాశాలను చేజక్కించుకుని ఎన్నో హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు. గత కొంతకాలంగా రాజ్ తరుణ్ సినిమాలలో నటించడం లేదు.
సిద్ధార్థ్ :
హీరో సిద్ధార్థ్ తన కెరీర్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. నటనలో తననుతాను ప్రూవ్ చేసుకొని లవర్ బాయ్ గా కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టాడు. తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమైన సిద్ధార్థ రీసెంట్గా చీతా సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
నిఖిల్ :
హ్యాపీ డేస్ మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన నిఖిల్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం హీరోగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. పరస హిట్ సినిమాలను అందుకుంటున్న నిఖిల్ ఎప్పుడు వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటనలో తన సత్తా చాటుతూ ఉంటాడు