ఊరు పేరు భైరవకోన: కట్టిపడేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో పాన్ ఇండియా హిట్‌పై కన్ను.. కానీ…

సందీప్ కిషన్ రీసెంట్ గా “మైఖేల్” సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ఇప్పుడు ఒక పాన్ ఇండియా హిట్ కొట్టాలని ఈ టాలెంటెడ్ యాక్టర్ బాగా ప్రయత్నిస్తున్నాడు. వినూత్న ఫాంటసీ చిత్రాలకు పేరుగాంచిన ప్రఖ్యాత దర్శకుడు VI ఆనంద్‌తో ప్రస్తుతం ఈ యంగ్ హీరో జతకట్టాడు. వీరిద్దరూ కలిసి “ఊరు పేరు భైరవకోన” సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఒక కల్పిత గ్రామంలో జరిగిన ఒక అతీంద్రియ ఫాంటసీ. ఇది ఆఫ్టర్ డెత్, యూనివర్స్‌ సీక్రెట్స్ బయటపెట్టే పురాతన పుస్తకం గరుడ పురాణం ఆధారంగా రూపొందిస్తున్నట్లు సమాచారం.

చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం పోస్టర్లు, టీజర్‌లతో ప్రేక్షకులలో కొంత క్యూరియాసిటీని రేకెత్తించింది. అయితే ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. దాంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. ఫాంటసీ ఎలిమెంట్స్‌ని తెరపైకి తీసుకురావడానికి ఈ సినిమా ప్రొడక్షన్‌లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది అందువల్లే ఈ మూవీ ఈ ఆలస్యం అవుతూ వస్తుందని అంటున్నారు. ఇప్పటిదాకా తీసిన VFX క్వాలిటీతో దర్శకుడు సంతృప్తి చెందలేదని, కొన్ని సవరణలు, మెరుగుదలలను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు త్వరలో VFX వర్క్‌ను పూర్తి చేసి, 2024, ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మంచి డేట్ ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట.

ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడీగా వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు రొమాన్స్, కామెడీ, యాక్షన్, మిస్టరీ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వస్తుందని టాక్. కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు, నటుడిగా తన సత్తాను నిరూపించుకోవడానికి పెద్ద హిట్‌ సందీప్‌ కిషన్‌కి ఇప్పుడు చాలా అవసరం. ఆ హిట్‌ ఈ సినిమాతో సాధించాలని సందీప్ ఎంతో తపన పడుతున్నాడు. క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్‌గా పేరు తెచ్చుకున్న విఐ ఆనంద్‌కి కూడా ఈ సినిమా ఓ పరీక్ష. ఈ చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేకమైన, యూనిక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని అనడంలో సందేహం లేదు.