అన్ని కలిసి వచ్చుంటే ఉంటే కీర్తి సురేష్ – నాగచైతన్య భార్య అయ్యుండేదా..? లాస్ట్ మినిట్ లో చెడ కొట్టిన ఆ హీరో..!

కీర్తి సురేష్.. మహానటి. ఎస్ ఇదే మాట అంటున్నారు జనాలు. ఒకప్పుడు మహానటి అంటే అందరికీ సావిత్రి గారు ఎలా గుర్తొచ్చేవారో .. ఇప్పుడు మహానటి అంటే మాత్రం అందరికీ గుర్తొచ్చేది కీర్తి సురేష్ . అలాంటి అద్భుతమైన నటనను కనుబరుస్తుంది ఈ ముద్దుగుమ్మ . కీర్తి సురేష్ చూస్ చేసుకునే పాత్రలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి.

అందుకే ఆమెను జనాలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు . అయితే కీర్తి సురేష్ నాగచైతన్య తో నటించాల్సిన సినిమా మిస్ అయింది. అందులో ఆయనకు భార్య రోల్ లో నటించాల్సింది . ఆ సినిమా మరేదో కాదు మజిలీ . సమంత – నాగచైతన్య – దివ్యాంక కౌశిక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .

అయితే ఈ సినిమాలో సమంత పాత్ర కోసం ముందుగా కీర్తి సురేష్ ను అనుకున్నారట శివనిర్వాణ. అయితే ఆ పాత్ర కోసం ఎవరో చూస్ చేసుకోవడం కన్నా సమంతనే చూస్ చేసుకుంటే సినిమాకి హైలైట్ అవుతుందంటూ సజెషన్ ఇచ్చారట హీరో . ఆయన మరెవరో కాదు అఖిల్ అక్కినేని . దీంతో లాస్ట్ మూమెంట్లో కీర్తి సురేష్ ని తీసేసి సమంతని పెట్టుకున్నాడు శివ నిర్వాణ. అలా వీళ్ళ కాంబో మిస్ అయిందనమాట..!!