గుడ్డుని ఉడికించి తినడం లేక ఆమ్లెట్ల తినడం ఏది మంచిది..!!

మనం తినేటువంటి వాటిలో ఎక్కువగా పోషకాలు లభించే వాటిలో కోడిగుడ్డు కూడా ఒకటి.. మన శరీరానికి ఆరోగ్యంగా ఉంచి ప్రోటీన్లు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఎనర్జిటిక్ గా ఉంచడంలో కండరాల అభివృద్ధికి సైతం కోడిగుడ్లు చాలా సహాయపడతాయి. అయితే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తినడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారట.అలసట అనేది అసలు ఉండదని పలువురు హెల్త్ నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే చాలామంది గుడ్లను పలు రకాల పద్ధతిలో తింటూ ఉంటారు.చాలామంది కోడిగుడ్లను ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటారు.

ఉడకబెట్టిన గుడ్డు లేకపోతే ఆమ్లెట్ ఏది తినడమో మంచిగా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. గుడ్డు సంపూర్ణ ఆరోగ్యం వంటివి ఇందులో ప్రోటీన్లు చాలా ఉంటాయి గుడ్డిలో విటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి ఇవి మన శరీరానికి కూడా చాలా శక్తిని అందిస్తాయి. కోడిగుడ్లు ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన కళ్ళకి సైతం చాలా మేలు చేసేలా ఉంటాయి. శరీరానికి కూడా మంచి కొవ్వును పెంచేలా సహాయపడతాయి.

ఉడికించిన గుడ్లలో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో సుమారుగా 78 కేలరీలు ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి.. అయితే ఉడికించిన కోడిగుడ్డు తినడం మంచిదని తెలుపుతున్నారు. ఉడికించిన గుడ్డును ఇది మన ఆరోగ్యానికి వెంటనే శక్తిని అందిస్తాయి అంతేకాకుండా మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచేలా చేస్తాయి. ఆమ్లెట్లు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా టేస్ట్ గా కనపడుతుంది. ఇతర పదార్థాల కారణంగా ఇందులో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.అలాగే కొవ్వు పదార్థాల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఉడికించిన గుడ్డులోని పోషకాలు ఎక్కువగా ఉంటాయి.