రజినీకాంత్ లాల్ సలాం టీజర్ అదుర్స్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రాలలో లాల్ సలాం సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. గతంలో ధనుష్ నటించిన మూడు చిత్రాలకు ఈమె దర్శకత్వం వహించింది. ఇప్పుడు తాజాగా లాల్ సలాం అనే సినిమానీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో రజినీకాంత్ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేయడం జరిగింది.

ఈ సినిమా కూడా మాఫియా డాన్ మొయిద్దీన్ బాయ్గా కనిపించబోతున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఉండగా ఈ చిత్రాన్ని లైక ప్రొడక్షన్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. క్రికెట్ గేమ్ తో సంబంధం ఉన్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రం ఉండబోతుందని ఈ సినిమా టీజర్ లో చూపించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ముంబైకి చెందిన మాఫియా డాన్ భాయ్ గా రజనీకాంత్ మెప్పించినట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది ఇదంతా ఇలా ఉండదా ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి హార్డ్ డిస్కులు కూడా మాయమయ్యాయని ప్రచారం ఎక్కువగా వినిపించింది. రజనీకాంత్ కు సంబంధించి సన్నివేశాలు మాయమయ్యాయని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ టీజర్ లో చూస్తే అలాంటిదేమీ కనిపించలేదని తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రజినీకాంత్ ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేయబోతున్నారు. ప్రస్తుతం లాల్ సలాం సినిమా టీజర్ వైరల్ గా మారుతోంది.