మంగళవారం సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్…

‘RX100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్ కొట్టిన పాయల్ రాజ్‌పుత్, అజయ్ భూపతి మళ్లీ ‘మంగళవరం’ అనే మిస్టీరియస్ థ్రిల్లర్ కోసం జతకట్టారు. ఈ మూవీ బోల్డ్ కాన్సెప్ట్‌తో చిల్లింగ్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ నవంబర్ 17న పలు భాషల్లో విడుదల కానుంది.

అయితే శనివారం, మేకర్స్ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఈ ఈవెంట్‌లో బన్నీ RX100లో పాయల్ రాజ్‌పుత్ నటనను మెచ్చుకున్నాడు, ఇది ఒక ల్యాండ్‌మార్క్ సినిమా అని కితాబిచ్చాడు. అజయ్ భూపతి టెక్నికల్ స్కిల్స్, స్టోరీ టెల్లింగ్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని దర్శకుడిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. మంగళవరం సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇది చాలా బోల్డ్ సబ్జెక్ట్ అని, దమ్ముంటేనే దీనిని తీయడానికి సిద్ధమవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అజయ్ తనకు చిత్ర కథను చెప్పినప్పుడు తాను షాక్ అయ్యానని, టీజర్‌ను పుష్ప దర్శకుడు సుకుమార్‌కి చూపించానని అల్లు అర్జున్ వెల్లడించాడు. టీజర్ చూసి సుకుమార్ కూడా షాక్ అయ్యాడని, మేకర్స్ చేసిన సాహసోపేతమైన ప్రయత్నాన్ని అభినందిస్తున్నానన్నారు.

అలాగే నిర్మాతలు స్వాతి, ప్రణవ్ తనకు చాలా సన్నిహితులని, మంగళవారమే వారి తొలి చిత్రమని చెప్పారు. వీరంతా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరెన్నో సంచలనాత్మక చిత్రాలను రూపొందించాలని ఆకాంక్షించారు.

మంగళవరం షాకింగ్ ట్విస్ట్‌లతో కూడిన సినిమా అని అంటున్నారు. పాయల్ పాత్ర చాలా బోల్డ్‌గా, ఛాలెంజింగ్‌గా ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అందుకుంటుందో చూడాలి.