చరణ్-రష్మిక కాంబోలో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..సెట్ అయ్యుంటే పుష్ప కి అమ్మ మొగుడి లాంటి హిట్ అందుకునేదిగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో మిస్ అవుతూ ఉండడం సర్వసాధారణం. ఇండస్ట్రీలో చాలా కాంబో ఇలాగే మిస్ అయ్యాయి. అయితే ఒకసారి మిస్సయిన ఆ కాంబో సెట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది . అలాంటి ఓ కాంబోనే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా. మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ హీరో హీరోయిన్లు.

ఇద్దరి కాంబోలో సినిమా రావాలి అని ఫాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే వీళ్ళ కాంబోలో రావాల్సిన ఓ సినిమా వచ్చినట్లే వచ్చి మిస్ అయిపోయింది అది మరేదో కాదు రంగస్థలం . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కంటే ముందే కొంతమంది హీరోయిన్స్ ను అప్రోచ్ అయ్యారట సుకుమార్ .

వాళ్ళల్లో రష్మిక కూడా ఉండింది . ఇండస్ట్రీలోకి అప్పుడప్పుడే వస్తున్న రష్మిక ఈ పాత్ర చేసి ఉంటే హైలెట్ అయి ఉండేది . అయితే మొదటి సినిమాతోనే డీ గ్లామరస్ లుక్ లో నటిస్తే జనాలు యాక్సెప్ట్ చేయరేమో అన్న భయంతో ఈ పాత్ర రిజెక్ట్ చేసిందట రష్మిక . ఆ తర్వాత సమంత ఈ పాత్రలోకి వచ్చేసింది . అలా వీళ్ళ కాంబో మిస్ అయిందనమాట..!!