కోలీవుడ్ ఖతం.. మాలీవుడ్ ఇండస్ట్రీపై కన్నేసిన సునీల్..

తెలుగు చిత్రసీమలో మంచి కామెడీ టైమింగ్ తో దిగ్గజ హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఇప్పుడు ఈ హీరో గేమ్ చేంజర్, గుంటూరు కారం, పుష్ప 2 వంటి భారీ బడ్జెట్ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. అంతేకాకుండా ఇటీవల జైలర్, మార్క్ ఆంటోని, జపాన్ వంటి తమిళ సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు అతడు మలయాళం ఇండస్ట్రీపై కన్నేశాడు.

మలయాళంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం “టర్బో”తో ఆ ఇండస్ట్రీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. గతంలో మమ్ముట్టితో కలిసి “పోక్కిరి రాజా”, “మధుర రాజా” అనే రెండు సూపర్ హిట్స్ అందించిన వైశాఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. “ఆడు”, “అంజాం పతిర” వంటి కామెడీ మూవీలకు పేరుగాంచిన మిధున్ మాన్యువల్ థామస్ ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించారు.

మమ్ముట్టి ప్రొడక్షన్ హౌస్ అయిన మమ్ముట్టి కాంపానీ సోషల్ మీడియా పేజీలలో ఈ మూవీని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అనౌన్స్‌మెంట్‌ భాగంగా రిలీజ్ చేశారు. ఇందులో మమ్ముట్టి స్టైలిష్ అవతార్‌లో తుపాకీ, కారు కీ పట్టుకుని కనిపించాడు. ఈ పోస్టర్‌కు “ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్” అనే ట్యాగ్‌లైన్ కూడా ఉంది, ఇది మూవీ జానర్‌ను రివీల్ చేసింది.

ఈ సినిమా హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా ఉంటుందని, మమ్ముట్టి కార్ రేసర్‌గా నటిస్తున్నారని సమాచారం. సునీల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అతని పాత్ర వివరాలు తెలియాల్సి ఉంది. సునీల్ తెలుగు సినిమాలో తన కామిక్ టైమింగ్‌ వల్ల పాపులర్ అయ్యాడు ఆ తర్వాత

విలనిజం కూడా చూపించాడు. మరి సినిమాలో అతను ఎలాంటి షేడ్స్ ఉన్న పాత్ర చేస్తాడో తెలియాల్సి ఉంది. మమ్ముట్టితో స్క్రీన్ స్పేస్ సునీల్ పంచుకోవడం పట్ల అభిమానులుని ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.

“టర్బో” అనేది జయసూర్య ప్రధాన పాత్రలో మిధున్ మాన్యువల్ థామస్ దర్శకత్వంలో మొదట ప్లాన్ చేసిన “టర్బో పీటర్” రీ-వాంప్డ్‌ వెర్షన్ అని ఊహాగానాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్ అనివార్య కారణాల వల్ల ఆపివేయబడింది. తరువాత మమ్ముట్టి, వైశాఖ్‌లతో దీనిని పునఃప్రారంభించారు. మేకర్స్ ఈ పుకార్లను కన్ఫామ్ చేయలేదు లేదా ఖండించలేదు. “టర్బో” 2024లో విడుదల కానుంది. తమిళం, కన్నడ భాషలలో కూడా రిలీజ్ కానుంది.