“మంగళవారం సినిమాలో పాయల్ నే హీరోయిన్ గా ఎందుకు తీసుకున్నారో తెలుసా..?” టాప్ సీక్రేట్ రివీల్ చేసిన బన్నీ..!!

పాయల్ రాజ్ పుత్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాల్లోనే బోల్డ్ గా నటించి అభిమానులను అట్రాక్ట్ చేసింది . ఇప్పుడు మంగళవారం అనే మరో బోల్డ్ సినిమాలో నటించింది . ఈ సినిమా నవంబర్ 17న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .

ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ . ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజి పైకి వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ హీరోయిన్ పాయల్ రాజ్ పోత్.. డైరెక్టర్ అజయ్ భూపతి.. ప్రొడ్యూసర్ స్వాతి ను ఓ రేంజ్ లో పొగిడేసారు .

ముఖ్యంగా ఇలాంటి బోల్డ్ సినిమా అటెండ్ చేయడం పాయల్ రాజ్ పుత్ కే చెల్లింది అనే విధంగా పరోక్షంగా కామెంట్స్ చేశారు . కథ వినగానే ఇంత బోల్డ్ గా ఉందా ..? అంటూ ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు . అంతేకాదు సుకుమార్ సైతం ఈ కథ విని షాక్ అయిపోయారు అంటూ చెప్పుకొచ్చాడు .అయితే ఇలాంటి సినిమాలలో నటించాలంటే హీరోయిన్స్ కి డేర్ ఉండాలి అని పాయల్ రాజ్ పుత్ కి ఆ డేర్ ఉందని పరోక్షంగానే చెప్పేసాడు . దీంతో బన్నీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!