నిహారిక ఆ సినిమాను రిజెక్ట్ చేసి ఉండకపోతే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేదా.. ఇంత‌కీ ఆ మూవీ ఏంటంటే..?!

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అంతగా పేరు ప్రఖ్యాతలు పొందలేకపోయింది. అయినప్పటికీ వెనకడుగు వెయ్యకుండా కెరీర్ మీద ఫోకస్ పెట్టి నటిగా, నిర్మాతగా ఎదగడానికి కృషి చేస్తుంది. ఇక నిహారిక గతంలో చేతి దాకా వచ్చిన సినిమాలు రిజెక్ట్ చేసిందట. వీటిలో ఓ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది.

ఒకవేళ నిహారిక ఆ సినిమాలో నటించి ఉంటే.. ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేది అంటున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ఆమె మిస్ చేసుకున్న సినిమా ఏంటంటే.. నాగచైతన్య హీరోగా నటించిన ” 100% లవ్ “. ఈ మూవీని ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2011లో వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.

ఇందులో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్న నటించింది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత తమన్నకు మంచి అవకాశాలు వచ్చాయనే చెప్పాలి. మొదట ఈ సినిమాకి హీరోయిన్ గా నిహారికని అప్రోచ్ అయ్యారట. కానీ నిహారిక ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. ఒకవేళ నిహారిక ఈ సినిమాని ఒప్పుకుంటే ఈ రోజున పెద్ద హీరోయిన్ అయ్యుండేది అంటున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.