నీటిని ఎంత తాగిన దప్పిక తీరడం లేదా.. అయితే ఆ వ్యాధులే కారణమా..?

మానవుని శరీరానికి నీరు చాలా అవసరం ప్రతిరోజు కచ్చితంగా 4నుంచి 5 లీటర్ల నీటిని తాగాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. దీనివల్ల శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంటుంది. శరీరంలో అవయవాలు కూడా చాలా సక్రమంగా పనిచేస్తాయట.వీటితోపాటు జీర్ణక్రియ కూడా సాఫీగానే సాగుతుంది.. యూరిన్లో విషపదార్థాల సైతం బయటికి వెలుపడతాయి. అందుకే నీరు చాలా తాగడం మంచిదని వైద్యులు తెలుపుతూ ఉంటారు. అయితే చాలామంది ఎన్నిసార్లు నీళ్లు తాగినా కూడా దాహం తీరకుండా ఉంటుంది. అయితే అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక చాలామంది తమకు ఏదైనా చెప్పు ఉందేమో అన్నట్లుగా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటి గురించి తెలుసుకుందాం.

నీరు తరచుగా దాహం వేస్తోంది అంటే ముఖ్యంగా మధుమేహ సమస్యకు సంకేతం అని వైద్యులు తెలుపుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడే శరీరంలో మూత్ర విసర్జన ద్వారా వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందట. దీనివల్ల నీటి కొరత ఎక్కువగా ఏర్పడుతుందట.

ఎక్కువగా మహిళలలో రక్తహీనత సమస్య ఎదురవుతూ ఉంటుంది.. హిమోగ్లోబిన్ తగినంత లేకపోవడం వల్ల ఈ రక్తహీనత సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల అధిక ప్రెజర్ వల్ల ఇలాంటివి ఏర్పడతాయట దీని వల్ల కూడా అధికంగా దాహం వేస్తుంది.

నోరు తరచూ పరిపారడం వల్ల కూడా దాహం ఎక్కువగా వేస్తుందట. పదేపదే నోటిని తడుపుకోవడానికి ఎక్కువగా నీటిని తాగాల్సి ఉంటుంది.. సిగరెట్ ఎక్కువగా తాగడం మందులు ఎక్కువ మోతాదులు ఉపయోగించడం వల్ల కూడా నోరు పొడిబారుతుంది దీనివల్ల నోరు దుర్వాసన రుచులు మార్పు చెవులలో మంట వంటివి వస్తాయట.

గర్భిణీలలో కూడా అధిక దాహం వేస్తూ ఉంటుంది మొదటి మూడు నెలలలో రక్తపరిమాణం పెరుగుతుంది ఆ తర్వాత మూత్రపిండాలలో అదనంగా ద్రవం ఏర్పడడానికి కూడా కారణమవుతుంది.. దీని వల్ల మూత్ర విసర్జన ఎక్కువగా వెళ్లడం వల్ల దాహం ఎక్కువగా వేస్తుందట.