” పుష్ప ” సినిమాలో దాక్షాయిని పాత్రను మిస్ చేసుకున్న ఆ బ్యూటీ… దరిద్రమంతా ఈమె చుట్టూనే ఉన్నట్టుంది గా…!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ” పుష్ప ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ ని దక్కించుకుంది. అంతేకాకుండా రీసెంట్ గా ఈ సినిమా కారణంగా బన్నీకి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు సైతం లభించింది. ఇక ప్రస్తుతం పుష్ప కు సీక్వెల్ గా ” పుష్ప 2 ” తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌రవేగంగా జ‌రుగుతుంది. కాగా భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక పుష్ప సినిమాలో హాట్ యాంకర్ అనసూయ.. దాక్షాయిని పాత్రలో నటించి ప్రేక్షకులని ఏ రేంజ్ లో ఆకట్టుకుందో తెలిసిందే. అయితే దర్శక, నిర్మాతలు ఫస్ట్ ఈ పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ను ఎంపిక చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది.

కానీ వరలక్ష్మి ఈ రోల్ చేయడానికి అంగీకరించలేదట. ఇది విలన్ రోల్ కాదు.. అలా అని లీడ్ రోల్ కూడా కాదు. అప్పుడప్పుడే ఎదుగుతున్న తన కెరీర్ ఎక్కడ పడిపోతుందో అనే భయంతో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసిందట. ఇక అనంతరం జబర్దస్త్ బ్యూటీ అనసూయ ఈ అవకాశాన్ని కొట్టేసింది. ఈ వార్త విన్న ప్రేక్షకులు…” దరిద్రమంతా ఈమె చుట్టూనే ఉన్నట్టుందిగా… పిలిచి మరీ కెరీర్ ఇస్తానంటే చేతులారా పోగొట్టుకుంది ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.