దూత రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న చైతు.. ఏకంగా అంత మొత్తంలోనా..!!

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైతు వరుస సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను నమ్ముకున్నాడు. తాజాగా ” దూత ” అనే వెబ్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ వెబ్ మూవీ కోసం చైతు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇక చైతుకి పెద్ద పేరు ప్రఖ్యాతలు దక్కకపోయినా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక గతంలో బంగార్రాజు, లవ్ స్టోరీ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన.. అనంతరం కస్టడీ సినిమాతో బోల్తా కొట్టాడు. ఇక ఇది ఇలా ఉంటే.. గతంలో దర్శకుడు కే. విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ మొదలుపెట్టగా… తాజాగా అది కంప్లీట్ అయింది.

స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమవుతోంది. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ వెబ్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక చైతుకి పెద్ద పేరు లేకపోయినా… ఈ వెబ్ మూవీ కోసం బాగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ వెబ్ మూవీకి చైతు రూ. 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. సాధారణంగా ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల వరకు తీసుకునే చైతు.. ఈ వెబ్ మూవీకి మాత్రం రూ.8 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం.