ప్రభాస్ ” సలార్ ” సినిమా … ఆ విషయంలో ఫ్యాన్స్ కి నెత్తిన తడిగుడ్డేనా…!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కే కాకుండా.. ట్రైలర్ లాంచ్ కోసం కూడా నెక్స్ట్ లెవెల్ హైప్‌ నెలకొంది.

కానీ ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ హడావిడి సోషల్ మీడియాలో బాగానే ఉన్నప్పటికీ… ఇప్పటివరకు ఎలాంటి కొత్త పోస్టర్ని విడుదల చేయకపోవడం.. ఎటువంటి ప్రమోషన్స్‌లో ప్ర‌భాస్ పాల్గొన‌కపోవడం కారణంగా ఫ్యాన్స్ నిరాశకి గురవుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ నెత్తిన తడి గుడ్డేసుకుని కూర్చున్నారు. ఇక ఇలానే కొనసాగితే.. సినిమా మీద హైప్ సైతం పడిపోతుంద‌నే చెప్పాలి. దీంతో సినిమా కి పెద్ద ఎత్తున దెబ్బ తగలవచ్చు. మరి ఈ ఘటనపై మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.