ఆ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే ” వార్ 2 ” పక్కా సూపర్ హిట్.. బయటపడ్డ అసలు రహస్యం…!!

హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కనున్న మూవీ ” వార్ 2 “. ఇక 2025 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీన ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కి ఫిక్స్ అయింది. గురువారం రోజున ఈ సినిమా రిలీజ్ కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వెనుక సరైన ప్లానింగ్ ఉందని సమాచారం. ఎటువంటి పోటీ లేకుండా ఎక్కువ సెలవులు ఉన్న డేట్ కావడం వల్లే ఈ డేట్ ను ఎంపిక చేశారట మేకర్స్. మొదట ఈ సినిమాను 2025 జనవరి 25న రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకోగా… పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం సరిపోదని రిలీజ్ డేట్ ను మార్చారు.

స్పై యూనివర్స్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన… వీరి కాంబో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఆ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.