మహేష్ బాబు నటించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్ట‌మా.. ఏం చేశాడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దివంగ‌త‌ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే వార్ 2 సినిమాతో తారక్ ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కు ప్రతి నాయకుడిగా ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. దీని తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమా తెరకెక్కనుంది.

అయితే ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ కు మహేష్ నటించిన సినిమాలలో ఫేవరెట్ సినిమా ఏమై ఉంటుంద‌నే ఆశ‌క్తి చాలామంది ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమా ఏంటో.. తెలుసుకుందాం. ఎన్టీఆర్, మహేష్ బాబుతో కలిసి పనిచేసిన డైరెక్టర్లలో కృష్ణవంశీ ఒకరు. ఇక కృష్ణవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్‌కి మహేష్ బాబు నటించిన మురారి సినిమా అంటే చాలా ఇష్టం అంటూ వివరించాడు. నాతో మురారి లాంటి సినిమాను తీయవచ్చు కదా అని జూనియర్ ఎన్టీఆర్ కృష్ణవంశీని అడిగారట.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రాఖీ సినిమా కరెక్ట్ అని అందుకే నేను రాఖి సినిమాను ఆయనతో తీశానని వివరించాడు కృష్ణవంశీ. ఇక సినీ ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఎన్టీఆర్ ఎప్పుడు ఎంత సన్నిహితంగా ఉంటూ ఉంటారు. అన్న తమ్ముళ్లులా వారిద్దరు మంచి బాండింగ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి కనిపించి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చారు. అయితే ఫ్యూచర్లో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.