కింగ్ నాగార్జున ” నా సామిరంగ ” సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్…!!

అక్కినేని నాగార్జున మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా… బిగ్ బాస్ అనే రియాలిటీ షో కి హోస్టింగ్ సైతం చేస్తున్నాడు. ఇక నాగార్జున హీరోగా నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్నలేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామిరంగ “.

ఇక ఈ సినిమాని 2023 డిసెంబర్ 7 నాటికి పూర్తి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 2024 సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకి తేవాలనే ప్లాన్ చేస్తున్నారు మేకర్. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నాగార్జున తో పాటు… మరో హీరో ఉండబోతున్నట్లు సమాచారం.

ఇక భారీ అంచనాలున్న ఈ సినిమాని శ్రీనివాస్ చిట్లూరి శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ పై నిర్మిస్తున్నారు. ఇక ప్రసన్న కుమార్ ఆకట్టుకునే కథ మరియు సంభాషణలతో రూపొందించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై… నాగార్జున అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.