బిగ్ బాస్ బ్యూటీ కీర్తి మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… మరి అంత తక్కువ…!!

బుల్లితెర నటిగా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కీర్తి ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి కూడా వెళ్లి పెద్ద ఎత్తున అభిమానులని సంపాదించుకుంది. ఇలా పలు తెలుగు, కన్నడ భాషల సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీ గా ఉన్న కీర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేసింది.

ముఖ్యంగా తన రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నలు ఎదురవ్వడంతో తన ఫస్ట్ రెమ్యూనరేషన్ గురించి కూడా చెప్పింది. ఈమె మాట్లాడుతూ.. కన్నడ సినిమాలో మొదట 300 రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పి నన్ను నటించమన్నారు అయితే అది పూర్తయిన తరువాత ఆ 300 రూపాయలు ఇప్పటికీ ఇవ్వలేదని ఆమె తెలియజేసింది.

అయితే తిరిగి 200 రూపాయలతో మరొక ప్రాజెక్టులో చేశానని అందులో 50 రూపాయలు నాకు.. అవకాశం కల్పించిన వారు తీసుకుని 150 రూపాయలు మాత్రమే నాకు కన్నడలో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో నేను కేవలం ఒక సీరియల్ కోసం రెండు రోజులు మాత్రమే పని చేశానని అప్పటికి నాకు 22,000 రెమ్యునరేషన్ ఇచ్చారంటూ ఈ సందర్భంగా తెలియజేసింది కీర్తి. ప్రస్తుతం కీర్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.