వరుస ప్లాపులతో ఉన్న ప్రభాస్ సక్సెస్ అందుకోవడానికి.. మహేష్ ఏం చేశాడో తెలుసా..?!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్ మొదట ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణంరాజు నట వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ సినిమాల్లో మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్ తను నెక్స్ట్ మూవీ అయిన రాఘవేంద్ర లో క్లాస్ లుక్ లో కనిపించాడు. అయితే ఈ సినిమా కూడా ప్రభాస్‌కు సక్సెస్ ఇవ్వలేకపోయింది. దీంతో ప్రభాస్ నిరుత్సాహపడ్డాడట‌.

ఇక త‌ర్వాత శోభన్ డైరెక్షన్లో ఎమ్ఎస్‌రాజు నిర్మాతగా తెరకెక్కిన వర్షం సినిమాలో ప్రభాస్ నటించాడు. ఇక వర్షం సినిమా ఆడియో ఫంక్షన్ కు ఎవరైనా స్టార్ హీరో వస్తే సినిమా పై మంచి హైప్‌ పెరుగుతుంది. సినిమా సక్సెస్ అవుతుందని భావించారట మూవీ మేకర్స్. ఆ టైంలో వర్షం మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్.. మహేష్ బాబు తో ఉన్న ఫ్రెండ్షిప్ కొద్దీ ఆయనను గెస్ట్ గా ఆహ్వానించారు. మహేష్ బాబు కూడా ఈవెంట్ కు గెస్ట్ గా రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

మహేష్ అప్పటికే ఒకడు సినిమాతో భారీ హిట్ త‌న‌ ఖాతాలో వేసుకుని ఈ ఆడియో ఫంక్షన్ కు రావడంతో.. వర్షం సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి సక్సెస్ అందుకొని ప్రభాస్ ను స్టార్ హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ సినీ కెరీర్‌ను వర్షం సినిమా మలుపు తిప్పింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విధంగా మహేష్ బాబు, ప్రభాస్ ఆడియో ఫంక్షన్ లో గెస్ట్ గా వచ్చి ప్రభాస్‌కు మొదటి హిట్ అందుకొడానికి కార‌ణం అయ్యాడు.