వావ్‌: త‌న చిట్టి ఫాలోవ‌ర్ కోసం బ‌న్నీ ఏం చేశాడో చూడండి.. ( వీడియో)

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌స్తుతం తెర‌కెక్కుతోన్న భారీ సినిమా “పుష్ప 2 ది రూల్” . పుష్ప ది రైజ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇప్పుడు బ‌న్నీ ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ‌న్నీకి జోడీగా ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తాడు. బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఇప్ప‌టికే వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వీరి కాంబినేష‌న్లో నాలుగో సినిమా అంటే.. అందులోనూ బ‌న్నీకి పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చిన త‌ర్వాత వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతుండ‌డంతో ఖ‌చ్చితంగా ఈ ప్రాజెక్ట్ సెన్షేష‌న్ క్రియేట్ చేస్తుందంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ రోజు తెలంగాణ‌లో జ‌రుగుతోన్న అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బ‌న్నీ ఓటు హ‌క్కు వినియోగించుకున్నాడు. తాను ఓటు వేసిన ఫొటో సోష‌ల్ మీడియానుంచి పోస్ట్ చేయ‌గా ఆ పిక్ ఇప్పుడు పిచ్చ వైర‌ల్‌గా మారింది. దీంతో పాటు బ‌న్నీ ఇన్‌స్టాలో ఓ వీడియో కూడా పోస్ట్ చేయ‌డంతో ఇప్పుడు అది వైర‌ల్ అవుతోంది.

తాను ఓ చిన్నారితో మాట్లాడుతూ ఆమె ఇన్‌స్టా అక్కౌంట్ నుంచి ఓ చిన్నారికి స‌పోర్ట్ చేశాడు. త‌న బుల్లి ఫాలోవ‌ర్ అక్కౌంట్ నుంచి ఆమెకు ఇంకా ఎక్కువ మంది ఫాలో అవ్వండి అంటూ ఆమె త‌ర‌పున మాట్లాడుతూ త‌న ఉదార‌త చాటుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మార‌డంతో ఇది సోష‌ల్ మీడియాలో చ‌క్కెర్లు కొడుతోంది. బ‌న్నీ, ఆ చిన్నారి ఏం మాట్లాడుకున్నారంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.